JC Diwakar Reddy: మేము ఇంటికెళ్లి కనీసం పెళ్లాన్నైనా చూసి రావద్దా?: జేసీ దివాకర్ రెడ్డి

  • బస్సు యాత్ర వాయిదాపై స్పందించిన జేసీ
  • చాలా రోజులు ఢిల్లీలో ఉండి వచ్చాం
  • వెంటనే బస్సు ఎక్కమంటే ఎలా?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు తలపెట్టిన బస్సు యాత్ర వాయిదా పడటంపై ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఢిల్లీ నుంచి వెంటనే రావాలన్న చంద్రబాబు ఆదేశాలతో అమరావతికి వచ్చిన ఆయన ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు. నిరసనలన్నీ ఒకే రోజు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఢిల్లీలో చాలా రోజులు ఉండి వచ్చామని, తాము కనీసం ఇంటికి వెళ్లి పెళ్లాం ముఖమైనా చూడవద్దా? అని చమత్కరించారు. అప్పుడే యాత్ర అంటూ బస్సు ఎక్కమంటే ఎలాగని ప్రశ్నించారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమకుందని అభిప్రాయపడ్డ జేసీ, అతి త్వరలోనే బస్సు యాత్ర ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, రాజీనామాలు చేస్తే కేంద్రాన్ని ప్రశ్నించే వారు ఎవరు ఉంటారని ప్రశ్నించారు.

JC Diwakar Reddy
Bus Yatra
Chandrababu
Andhra Pradesh
Special Category Status
  • Loading...

More Telugu News