bhojpuri movies: దర్శకుడిపై అత్యాచారం కేసును కొట్టేసిన కోర్టు!

  • అవకాశం ఇస్తానని పిలిచి లైంగిక దాడి 
  • మరుసటి రోజు మరోసారి అత్యాచారం చేశాడని ఆరోపణ 
  • పరస్పర అంగీకారంతో పాల్గొన్న శృంగారం అని పేర్కొన్న న్యాయస్థానం 

సినిమాల్లో ఐటెం సాంగ్ లో అవకాశం ఇస్తానని చెప్పి, తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని భోజ్ పురి సినీ దర్శకుడు రాంకుమార్ కుమావత్ (51)పై వర్ధమాన నటి పెట్టిన కేసును ముంబై సెషన్స్ న్యాయస్థానం కొట్టివేసింది. ఆమె చేసిన ఆరోపణల ప్రకారం... 2009 జూలై 21న తన సినిమాలో ‘ఐటెం గర్ల్‌’ అవకాశం ఇస్తానంటూ నటిని కుమావత్‌ తన కార్యాలయానికి పిలిచాడు. ఆ సమయంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు డ్యాన్స్‌ రిహార్సల్‌ పేరిట పిలిచి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆ అవకాశం మరో యువతికి ఇచ్చాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ఈ కేసు విచారణ సందర్భంగా సినిమాల్లో అవకాశం దొరుకుతుందన్న ఆశతోనే తాను ఆయన ఇంటికి వెళ్లానని, సినిమాలో తనకు అవకాశం దొరికి ఉంటే కేసు నమోదు చేసేదాన్ని కాదని డిఫెన్స్‌ లాయర్ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ లో ఆమె తెలిపింది. అంతే కాకుండా ఆమె శరీర భాగాలపై ఉన్న గాయాలు కూడా కల్పితమైనవేనని వైద్యనివేదికలో తేలింది. దీంతో వారిద్దరూ పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నారని నిర్ధారించిన న్యాయస్థానం, ఆ కేసును కొట్టివేసింది.

bhojpuri movies
actress rape
director
  • Loading...

More Telugu News