charan: 'రంగస్థలం' సక్సెస్ ఈవెంట్ వేదికగా హైదరాబాద్

  • చరణ్ కి మరిచిపోలేని హిట్ 
  • మెగా అభిమానుల సంబరాలు
  • భారీగా సక్సెస్ ఈవెంట్        

'రంగస్థలం' రామ్ చరణ్ మరిచిపోలేని హిట్ ను ఇచ్చింది. మెగా అభిమానులు సంతోషంతో సంబరాలు జరుపుకునేలా చేసింది. నిన్నరాత్రి ఈ సినిమా చూసిన పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ సినిమాను గురించిన పూర్తి అభిప్రాయాన్ని సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడతానని చెప్పారు. దాంతో సక్సెస్ ఈవెంట్ ను జరపనున్నారనే విషయం తెలిసింది. ఆ వేడుకకి పవన్ రానున్నాడనే విషయం అర్థమైంది.

ఇక ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఈ నెల 12వ తేదీ సాయంత్రం జరపనున్నారనేది తాజా సమాచారం. చిరంజీవి .. పవన్ కల్యాణ్ ఇద్దరూ ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ ఫంక్షన్ కి హాజరయ్యే ముఖ్యులంతా 'చిట్టిబాబు' పాత్ర తరహాలో గళ్ల చొక్కా .. లుంగీ డ్రెస్ కోడ్ తో రానున్నారట. ఇది ఈ వేడుకకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

  • Loading...

More Telugu News