JC Diwakar reddy: నాలుగు రోజులు తినకుంటే నీరసం రాదా? చచ్చేదాకా కూర్చోమనండి చూస్తా!: జేసీ దివాకర్ రెడ్డి

  • ఇంతకన్నా వైసీపీ చేయగలిగిందేమీ లేదు
  • ఇప్పటికే మూడు వికెట్లు పడిపోయాయి
  • అమరావతిలో చంద్రబాబును కలిసిన అనంతరం జేసీ

నాలుగు రోజుల పాటు అన్నం తినకుండా ఉంటే ఎవరికైనా నీరసం వస్తుందని, ఢిల్లీలో కూర్చుని దీక్ష చేస్తున్నామని చెబుతున్న వైసీపీ నేతలు అంతకన్నా ఇంకేమీ చేయలేరని తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిరాహారదీక్షకు కూర్చున్న ఐదుగురిలో ఇప్పటికే మూడు వికెట్లు పడిపోయాయని, ఆరోగ్యం క్షీణించిందని చెబుతూ నేడో, రేపో మిగతా ఇద్దరూ ఆసుపత్రులకు వెళ్లిపోతారని చెప్పారు. ఈ ఉదయం అమరావతిలో చంద్రబాబును కలిసిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు.  

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసినట్టుగా మరణించేంత వరకూ వైకాపా ఎంపీలు దీక్షలు చేయగలరా? అని జేసీ ప్రశ్నించారు. ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు కూడా రిజైన్ చేస్తే, తన పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని, తనతో పాటు మిగతా ఎంపీలనూ రాజీనామా చేయిస్తానని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయిన రాహుల్ గాంధీ, ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. ఓట్ల కోసమే తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని ఆయన చెప్పుకుంటున్నారని విమర్శించారు.

టీడీపీ ప్రధాని ఇంటి ముందే ధర్నా నిర్వహించి జాతీయ మీడియాకు ఎక్కిందని, కేవలం తమకు ప్రచారం కోసమే వైసీపీ దీక్ష చేస్తోందని జేసీ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో తాము చేసిన నిరసనలపై చంద్రబాబుకు వివరించానని, తదుపరి కార్యాచరణపై చర్చించానని చెప్పారు.

JC Diwakar reddy
Amaravati
Chandrababu
YSRCP
New Delhi
  • Loading...

More Telugu News