KTR: శ్రీశైలం వెళ్లి, నడిరోడ్డుపై తీన్ మార్ ఆడిన టీఆర్ఎస్ నేత... వైరల్ అవుతున్న వీడియో!

  • కేటీఆర్ తో ప్రశంసలు పొందిన కార్పొరేటర్ సామ
  • ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండే నేత
  • శ్రీశైలం రహదారిపై పాటలకు డ్యాన్స్

సామ తిరుమల్ రెడ్డి... హైదరాబాద్ లో టీఆర్ఎస్ నేత. పౌర సమస్యలు తన ముందుకు వస్తే, వెంటనే స్పందించి, వాటిని నెరవేర్చేవరకూ నిద్రపోరని స్వయంగా మంత్రి కేటీఆర్ తో ప్రశంసలు పొందిన వ్యక్తి. పారిశుద్ధ్య కార్మికులతో కలసి చెత్త ఎత్తడం, మోరీల్లోకి దిగి వ్యర్థాలను స్వయంగా తొలగించడం వంటి పనులెన్నో చేశారు. ఈసారి ఆయన మరో వినూత్న పని చేయగా అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమ మిత్రులు, అనుచరులతో కలసి శ్రీశైలం వెళ్లిన సామ తిరుమల్ రెడ్డి, తిరుగుదారిలో నడిరోడ్డుపై తీన్ మార్ ఆడారు. "పచ్చపచ్చని పల్లె.. పచ్చాని పల్లె..",  "మబ్బుల్లో లేచింది, పున్నామ.. పున్నామ... నిండు పున్నామ.." పాటలకు రోడ్డుపై తనదైన శైలిలో డ్యాన్స్ చేశారు. రోడ్డుపై వాహనాలు వెళుతున్నా పట్టించుకోకుండా ఆడి పాడారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

KTR
Sama Tirumal Reddy
Srisailam
Teenmaar
  • Loading...

More Telugu News