rakul preet singh: నాకింతవరకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు!: రకుల్ ప్రీత్ సింగ్

  • కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది
  • ఎవరు అడ్వాంటేజ్ తీసుకున్నా? నిర్ణయం తీసుకోవాల్సింది మనమే
  • నేను నా గురించి మాత్రమే మాట్లాడుతున్నాను

సినిమాల్లో అవకాశాల కోసం కొందరు ఏమైనా చేస్తారేమో, కానీ తాను మాత్రం అలా చేయనని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. కాస్టింగ్ కౌచ్ పై నిరసన గళం విప్పిన శ్రీరెడ్డిపై మండిపడిన రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, అమ్మాయి పిలవగానే చెప్పిన చోటుకు వస్తుందని, చెప్పినట్టు చేస్తుందని భావించి, ఆమెపై వందకోట్లు పెట్టుబడి పెట్టి ఎవరూ సినిమా తీయరని రకుల్ ప్రీత్ తెలిపింది. కాస్టింగ్ కౌచ్ పై సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోందని తెలిపింది.

తాను కేవలం తన గురించి మాత్రమే మాట్లాడగలనని చెప్పింది. తనకింత వరకూ అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని రకుల్ స్పష్టం చేసింది. సినీ పరిశ్రమలో ప్రతిభే అంతిమంగా నిలబెడుతుందని రకుల్ ప్రీత్ తెలిపింది. పరిశ్రమలోకి కొత్తగా వచ్చే అమ్మాయిలకు తాను చెప్పేదేంటంటే..  'అవకాశాల పేరుతో అడ్వాంటేజ్ తీసుకునేందుకు చాలా మంది ఎదురు చూస్తుంటారు.. వారు కోరుకున్నది ఇవ్వాలా? వద్దా? అన్నది నిర్ణయించుకోవాల్సింది మహిళలే'నని ఆమె స్పష్టం చేసింది. సరైన అవకాశం రావడానికి సమయం పడుతుందని, ఓపిగ్గా ఎదురు చూడాలని సూచించింది.

rakul preet singh
casting couch
Tollywood
  • Loading...

More Telugu News