Sri Reddy: మన ఇద్దరు సీఎంలు, మంత్రులు మాత్రమే నా గురించి మాట్లాడటం లేదు: నటి శ్రీరెడ్డి

  • ఫిల్మ్ చాంబర్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి
  • తెలుగు రాష్ట్రాల సీఎంలను టార్గెట్ చేస్తూ ఫేస్ బుక్ పోస్టు
  • ప్రపంచమంతా తన గురించి చర్చిస్తుంటే సీఎంలు మాట్లాడటం లేదని వ్యాఖ్య

తనకు టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదని, అవకాశాలు అడిగే అమ్మాయిల పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ గతవారంలో హైదరాబాద్, ఫిల్మ్ చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి, తన ఫేస్ బుక్ ఖాతాలో తెలుగు రాష్ట్రాల సీఎంలను టార్గెట్ చేసుకుంది.

ఈ ఉదయం తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, "ప్రపంచమంతా నా నిరసన గురించి చర్చించుకుంటోంది. కానీ మన మంత్రులు, ఇద్దరు సీఎంలు మాత్రం దీని గురించి మాట్లాడక పోవడం చాలా బాధాకరం" అని వ్యాఖ్యానించింది. తనకు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ లో సభ్యత్వం ఇవ్వక పోవడాన్ని ఆమె నిరసిస్తుండగా, శ్రీరెడ్డికి సభ్యత్వం ఇచ్చే ప్రసక్తే లేదని 'మా' స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News