madhavan: నా కొడుకు దేశాన్ని గర్వపడేలా చేశాడోచ్...!: ఆనందంలో సినీ నటుడు మాధవన్

  • ధాయ్ లాండ్ లో జరుగుతున్న అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలు
  • 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీపడిన మాధవన్ కుమారుడు వేదాంత్  
  • మూడో స్థానంలో నిలిచి దేశానికి కాంస్య పతకం అందించిన  తనయుడు 

ప్రముఖ సినీ నటుడు మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నీలో మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ భారత్‌ కు కాంస్యపతకం అందించాడు. థాయిలాండ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న వేదాంత్... 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీ పడ్డాడు. మూడో స్థానంలో నిలిచిన వేదాంత్ కాంస్యపతకం సొంతం చేసుకున్నాడు.

ఈ ఆనందాన్ని మాధవన్ ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నాడు. 'నాతో పాటు నా భార్య సరిత గర్వించాల్సిన విషయం ఇది... మా అబ్బాయి వేదాంత్ థాయిలాండ్ అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలలో మనదేశానికి కాంస్యపతకం సాధించిపెట్టాడు' అని ట్వీట్ చేస్తూ తన ఇన్ స్టా గ్రామ్ లింక్ ను షేర్ చేశాడు. ఆ లింక్ లో వేదాంత్ కాంస్య పతకంతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. దీంతో సినీ ప్రముఖులతో పాటు, అభిమానులు వేదాంత్‌ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

madhavan
madhavan ranganathan
vedanth madhavan
  • Loading...

More Telugu News