queen elizabeth: క్వీన్ ఎలిజబెత్ మహ్మద్ ప్రవక్త వారసురాలు!: చరిత్రకారుడు అబ్దుల్‌-హమీద్‌ అల్‌-అవానీ

  • క్వీన్ ఎలిజబెత్ మహ్మద్ ప్రవక్త 43వ తరం సంతానం
  • మహ్మద్ ప్రవక్త కుమార్తె ఫాతిమా సంతానమే క్వీన్ ఎలిజబెత్
  • స్పెయిన్ ను పాలించిన అరబ్ రాజులు కూడా క్వీన్ ఎలిజబెత్ పూర్వీకులే 

క్రైస్తవ మతాన్ని విశ్వసించే క్వీన్ ఎలిజబెత్ ముస్లింలు దేవుడి ప్రతినిధిగా భావించే మహ్మద్ ప్రవక్త వారసుల సంతానమని పేర్కొనే అధ్యయనం ఒకటి వెలుగు చూసింది. క్వీన్ ఎలిజబెత్ మహ్మద్ ప్రవక్త 43వ తరం సంతానమని ఈ అధ్యయం చెబుతోంది. క్వీన్ ఎలిజబెత్ మహ్మద్ ప్రవక్త కుమార్తె ఫాతిమా ద్వారా కలిగిన సంతానమని చరిత్రకారుడు అబ్దుల్‌-హమీద్‌ అల్‌-అవానీ తెలిపారు. స్పెయిన్‌ ను పాలించిన అరబ్‌ రాజులు కూడా క్వీన్ ఎలిజబెత్‌ పూర్వీకులేనని ఈ అధ్యయనంలో ఆయన తేల్చిచెప్పారు.

ఈ విషయాన్ని తొలిసారిగా 1986లో ఓ ప్రచురణ సంస్థ అధినేత హరాల్డ్‌ బ్రూక్స్‌-బేకర్‌ నిర్ధారించారు. తాజాగా దానిని మొరాకో పత్రిక అల్‌-ఒస్బుయ్‌ ప్రచురించింది. మొరాకో, అండెలాసియా, ఐరోపాలో పలు సామ్రాజ్యాలను పాలించిన రాజులు కూడా మహ్మద్ ప్రవక్త రక్తసంబంధీకులని చరిత్రకారుడు ప్రతిపాదించారు. ఆయన అధ్యయనంలో ప్రతిపాదించిన ప్రకారం క్వీన్ ఎలిజబెత్ (91)-2 మొరాకో రాజు మహమ్మద్‌-6, జోర్డాన్‌ రాజు అబ్దుల్లా-2లకు బంధువు అవుతారని దీనిపై తాజాగా అధ్యయనం చేస్తున్న చరిత్రకారులు చెబుతున్నారు. 

queen elizabeth
mohammad
muslims
  • Loading...

More Telugu News