bhavana: భావన లైంగిక వేధింపుల కేసులో వారిద్దరూ నన్ను ఇరికించారు: దిలీప్

  • లైంగిక వేధింపుల కేసులో దిలీప్ కొత్త వాదన 
  • నా మాజీ భార్యకు, ఆ దర్శకుడికి నేనంటే పడదు
  • వారిద్దరూ పథకం ప్రకారం నన్ను ఇరికించారు

మలయాళ సినీ నటి భావన కిడ్నాప్‌, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు, స్టార్ హీరో దిలీప్, ముఖ్య నిందితుడు పల్సర్ సునీలు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. తమ ఇద్దరినీ ప్లాన్ ప్రకారం ఇరికించారని వారిద్దరూ వాదిస్తున్నారు. ఈ కేసులో నెలల పాటు జైల్లో నిందితుడిగా గడిపి బెయిల్ పై బయటకు వచ్చిన దిలీప్ మాట్లాడుతూ, తనను ట్రాప్ చేసి తన మాజీ భార్య మంజు వారియర్, దర్శకుడు, నటుడు లాల్ ఇరికించారని చెప్పాడు.

తన భార్యతో తనకు విభేదాలున్నాయని, అలాగే లాల్ తో తనకు పడదని, వీరిద్దరూ కలిసి తనను పథకం ప్రకారం ఈ కేసులో ఇరికించారని ఆరోపించాడు. దీనిపై పల్సర్ సునీ మాట్లాడుతూ, కిడ్నాప్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. ఈ కేసులో తనను దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 

bhavana
dilip
rape case
pulsur suni
  • Loading...

More Telugu News