sharad yadav: ఏపీ ప్రజలు వాళ్ల హక్కునే అడుగుతున్నారు: శరద్‌ యాదవ్‌

  • కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు కొత్తగా కోరికలు కోరడం లేదు
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
  • ఎన్నికలకు ముందు 'హోదా' ఇస్తామన్నారు
  • ఇప్పుడు ఇవ్వలేమని చెప్పడం సరికాదు

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వాళ్ల హక్కునే అడుగుతున్నారని, కేంద్ర ప్రభుత్వాన్ని కొత్తగా కోరికలు కోరడం లేదని జేడీయూ నేత శరద్‌ యాదవ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిరవధిక నిరాహార దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజు వారి వద్దకు వెళ్లిన శరద్‌ యాదవ్‌ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని, అది ఏపీ ప్రజల హక్కని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, ఇప్పుడు పలు కారణాలు చూపుతూ ఇవ్వలేమని చెప్పడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

sharad yadav
Special Category Status
YSRCP
  • Loading...

More Telugu News