lankan premier league: లంకన్ ప్రీమియర్ లీగ్ డైరెక్టర్ గా రసెల్ అర్నాల్డ్

  • ఆగస్టు మూడో వారం నుంచి లీగ్ ప్రారంభం
  • ఐదేళ్ల పాటు డైరెక్టర్ గా రసెల్ అర్నాల్డ్
  • ప్రస్తుతం సిడ్నీలో నివసిస్తున్న రసెల్

శ్రీలంక మాజీ క్రికెటర్ రసెల్ అర్నాల్డ్ ను గొప్ప పదవి వరించింది. లంకన్ ప్రీమియర్ లీగ్ డైరెక్టర్ గా రసెల్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఆగస్టులో ఈ లీగ్ ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్, సీపీఎల్, సీఎస్ఎల్, బీపీఎల్ వంటి టీ20 లీగ్ లు విజయవంతం కావడంతో... శ్రీలంక బోర్డు కూడా టీ20కి తెరలేపింది. ఆగస్టు మూడో వారం నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు ఈ టోర్నీ జరగనుంది. రానున్న ఐదేళ్ల వరకు ఈ లీగ్ కు రసెల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తాడని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. రసెల్ అర్నాల్డ్ 2007లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ తర్వాత సిడ్నీలో ఆయన నివసిస్తున్నాడు.

lankan premier league
lpl
russel arnold
Sri Lanka
cricket board
  • Loading...

More Telugu News