galla jayadev: ఢిల్లీలో మేము అరెస్టైతే... మీరు ఇంత గౌరవంగా ట్వీట్ చేస్తారా?: జగన్ పై గల్లా ఫైర్

  • పోరాటాలు చేస్తూ, అరెస్ట్ అయ్యాం
  • జగన్ మాత్రం ఎంతో గౌరవంతో ట్వీట్ చేస్తున్నారు
  • మోదీని ఒక్క మాట కూడా అనడం లేదు

ఏపీ ప్రయోజనాల కోసం టీడీపీ ఎంపీలు ప్రధాని నివాసాన్ని ముట్టడించామని... పోలీసులు తమను అరెస్ట్ చేశారని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. తాము ఇంత స్థాయిలో పోరాడుతుంటే జగన్ మాత్రం మోదీని ఒక్క మాట కూడా అనకుండా... చాలా గౌరవంతో, రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

ఈ ఉదయం జగన్ ట్వీట్ చేస్తూ, మోదీ గారూ, ఏపీకి ఇచ్చిన హామీలను దయచేసి నెరవేర్చండి అంటూ విన్నవించారు. వైసీపీ ఎంపీల జీవితాలు, ఏపీ ప్రజల భవిష్యత్తు గందరగోళంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ ట్వీట్ పైనే గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

galla jayadev
jagan
Narendra Modi
  • Loading...

More Telugu News