Ayyanna Patrudu: పిచ్చి కుక్కను తరిమికొట్టినట్టు కొడతాం: మంత్రి అయ్యన్నకు వైసీపీ వార్నింగ్

  • అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోవాలి
  • జగన్ ఆదేశిస్తే నామరూపాల్లేకుండా చేస్తాం
  • గుడివాడ అమర్ నాథ్ తీవ్ర వ్యాఖ్యలు

ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై విశాఖ జిల్లా వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే పిచ్చి కుక్కను తరిమికొట్టినట్టు తరిమికొడతామని వార్నింగ్ ఇచ్చారు. తమ అధినేత జగన్ ఆదేశిస్తే... అయ్యన్నను నామరూపాల్లేకుండా చేస్తామని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు తమపై విమర్శలు చేయడాన్ని అయ్యన్న మానుకోవాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నర్సిపట్నంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అయ్యన్నపై మండిపడ్డారు.

Ayyanna Patrudu
gudivada amarnath
YSRCP
  • Loading...

More Telugu News