sri reddy: రాజకీయ నాయకులు సిగ్గుపడాలి: హీరోయిన్ శ్రీరెడ్డి

  • న్యాయం కోసం ఓ యువనటి నగ్నంగా నిలబడింది
  • దేశాన్ని ఇంతలా దిగజార్చిన రాజకీయ నాయకులు సిగ్గు పడాలి
  • చూడాల్సింది శరీరాన్ని కాదు.. జరిగిన అన్యాయాన్ని

తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ హీరోయిన్ శ్రీరెడ్డి అర్ధ నగ్నంగా నిరసన తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్టులో ఆమె రాజకీయ నాయకులపై కూడా మండి పడింది. గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఒక యువనటి న్యాయాన్ని అర్థిస్తూ బట్టలు విప్పుకుని, నగ్నంగా నిలబడే స్థాయికి దేశాన్ని దిగజార్చిన రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు సిగ్గు పడాలి అంటూ ఆమె పోస్ట్ చేసింది. చూడాల్సింది బట్టలు విప్పిన శరీరాన్ని కాదని, జరిగిన అన్యాయాన్ని, ఆవేదనను చూడాలని కోరింది.

sri reddy
tollywood
political leaders
comments
  • Loading...

More Telugu News