Jagan: మోదీని ఉద్దేశించి ట్వీట్ చేసిన జగన్

  • మన ఎంపీల దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది
  • ముగ్గురు ఎంపీలను ఆసుపత్రికి తరలించారు
  • మోదీ గారూ, మీరిచ్చిన హామీలను నిలబెట్టుకోండి

ఏపీకి ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో నిరాహారదీక్ష చేస్తున్న తమ ఎంపీల గురించి వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. "మన ఎంపీలు నాలుగు రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్నారు. ఇప్పటికే మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డిలను ఆసుపత్రికి తరలించారు. మోదీ గారూ, మా ఎంపీల జీవితాలు, ఏపీ ప్రజలు భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంది. ప్రత్యేక హోదా కోసం మీరు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని కోరుతున్నా" అంటూ ట్వీట్టర్ ద్వారా తెలిపారు.

వైసీపీ సీనియర్ ఎంపీలు మేకపాటి, వైవీ, వరప్రసాద్ లను ఆసుపత్రికి తరలించడంతో... యువ ఎంపీలు అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డిలు తమ దీక్షను కొనసాగిస్తున్నారు. 

Jagan
Narendra Modi
hunger strike
tweet
  • Loading...

More Telugu News