Chiranjeevi: జనసేన పార్టీ గురించి అల్లు అర్జున్ స్పందన

  • చిరంజీవి దారే నా దారి
  • ఆయనది ఏ పార్టీ అయితే.. నాది కూడా అదే పార్టీ
  • చిరంజీవి జనసేన అంటే.. నాది కూడా జనసేనే

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పడు అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ఆ పార్టీ కోసం ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు రాజకీయాల గురించి అల్లు అర్జున్ మాట్లాడలేదు. చిరంజీవిది ఏ పార్టీ అయితే తనదీ అదే పార్టీ అని చెబుతూ ఉన్నాడు. మరోవైపు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించినప్పటి నుంచి ఇంత వరకు ఆ పార్టీలపై బన్నీ స్పందించలేదు. తాజాగా ఓ ఇటర్వ్యూలో బన్నీకి దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

దానికి సమాధానంగా... రాజకీయాల గురించి తాను మాట్లాడాలంటే... రాజకీయాలపై చిరంజీవి అభిప్రాయం తనకు ముందు తెలియాలని బన్నీ చెప్పాడు. చిరంజీవిది ఏ పార్టీ అయితే తనదీ అదే పార్టీ అని తెలిపాడు. కాంగ్రెస్ పార్టీని కాదని పవన్ కల్యాణ్ కు మద్దతు తెలుపుతూ చిరంజీవి జనసేన అంటే... తనది కూడా జనసేనే అని చెప్పాడు. తనకంటూ ప్రత్యేకంగా పొలిటికల్ స్టాండ్ లేదని... చిరంజీవి దారే తన దారి అని తెలిపారు. 

Chiranjeevi
Pawan Kalyan
Allu Arjun
Jana Sena
prajarajyam
congress
  • Loading...

More Telugu News