Sukumar: తన ఐటమ్ సాంగ్స్ ఎందుకు హిట్ అవుతాయన్న సీక్రెట్ చెప్పిన సుకుమార్!
- సుకుమార్ చిత్రాల్లో హిట్ అయ్యే ఐటమ్ సాంగ్స్
- చిన్నప్పటి నుంచి పాటలు అలా పాడుకోవడంలో ఆనందం
- పట్టణాల్లో బూతుగా భావించే మాటలు పల్లెల్లో కామన్
- అభిమానులు కోరుతున్నారు కాబట్టే పెడుతున్నా: సుకుమార్
సుకుమార్ దర్శకత్వంలో సినిమా... ఆర్య, ఆర్య-2 రంగస్థలం... ఏ సినిమా చూసినా అందులో ఓ ఐటమ్ సాంగ్ ఉంటుంది. సినీ అభిమానులకు కిక్కిస్తుంది. ఆ పాట ఎంత సూపర్ హిట్ అవుతుందంటే, సినిమా విజయంలో ఆ పాటకూ భాగం ఉంటుంది. ఇక తన చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ ఎందుకంత హిట్ అవుతాయన్న విషయమై సుకుమార్ స్పందించాడు. ఆ రహస్యాన్ని చెబుతూ, తాను పల్లెటూరిలో రికార్డింగ్ డ్యాన్సులు చూస్తూ పెరిగానని చెప్పాడు.
చిన్నప్పటి నుంచి పాటలను బూతులతో పాడుకోవడం తనకు అలవాటని, జానపదాలను కూడా అలా తిట్టుకుంటూ పాడుకుంటుంటే సహజంగా భాషలో కలిసిపోయేదని చెప్పాడు. అదే భాష పట్టణానికి వచ్చేసరికి బూతు అవుతుందని, అలా మాట్లాడితే తప్పుపడతారని చెప్పిన సుకుమార్, ఆర్య సినిమాలో "అ అంటే అమలాపురం..." పాటను పెట్టామని, అది హిట్ కావడంతో తన చిత్రాల్లో ఆ సెంటిమెంట్ కొనసాగుతోందని అన్నాడు. అందువల్లే "రింగ రింగ", "జిగేల్ రాణి" వంటి పాటలు వచ్చాయని, అభిమానులు కోరుకుంటున్నారు కాబట్టే వాటిని పెడుతున్నామని చెప్పాడు.