Mahesh Babu: కత్తి మహేష్ పై నిప్పులు చెరుగుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్!

  • 'భరత్ అనే నేను' ఫంక్షన్ లో అభిమానుల హంగామా
  • పవన్ ఫ్యాన్స్ తో పోలుస్తూ కత్తి మహేష్ ట్వీట్
  • ఊరుకోబోమని మండిపడుతున్న అభిమానులు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల గురించి తన ట్విట్టర్ ఖాతాలో కామెంట్ పెట్టిన కత్తి మహేష్ పై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం 'భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ ఫంక్షన్ తరువాత కత్తి మహేష్ ఓ ట్వీట్ పెడుతూ, "పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి స్ఫూర్తి పొందుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్!" అనడమే ప్రిన్స్ అభిమానుల కారణానికి ఆగ్రహం. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఫ్యాన్స్ కేకలు, అరుపులతో హోరెత్తించిన సంగతి తెలిసిందే. ఇక తమ అభిమానాన్ని కించపరుస్తూ కత్తి మహేష్ ట్వీట్లు పెడుతున్నాడని ఫ్యాన్స్ మండిపోతున్నారు. కత్తికి కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ రాజకీయాల్లోకి వెళ్లారు కాబట్టి, ఆయన ఫ్యాన్స్ వదిలేశారని, తామలా వదిలేయబోమని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి కత్తి ట్వీట్ కు మహేష్ ఫ్యాన్స్ నుంచి హాట్ హాట్ రిప్లయ్ లు వస్తున్నాయి.

Mahesh Babu
Kathi Mahesh
Fans
Pawan Kalyan
  • Loading...

More Telugu News