Telugudesam: ప్రజలందరినీ ఏకం చేసి ప్రత్యేక హోదా సాధించి తీరతాం : ఎంపీ సుజనా చౌదరి

  • రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తాం
  • అవిశ్వాస తీర్మానంపై చర్చించకుండా కేంద్రం పారిపోయింది
  • ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చేలా కేంద్రం వ్యవహరిస్తోంది

ప్రజలందరినీ ఏకం చేసి ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరతామని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని, శాంతియుతంగా తమ నిరసనను తెలియజేస్తామని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకుండా కేంద్రం పారిపోయిందని, రాష్ట్ర విభజనతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చే బాధ్యత కేంద్రానిదే అని మరోమారు స్పష్టం చేశారు. ప్రధానిని కలిసేందుకు తాము వెళితే పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తారా? ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అనంతరం, టీడీపీ మరో ఎంపీ అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, ‘దేశమంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్’ అని కేంద్రం గుర్తించాలని, రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించడం సబబు కాదని హితవు పలికారు.

Telugudesam
mp sujana chowdary
  • Loading...

More Telugu News