Chandrababu: ఇది కేంద్ర ప్రభుత్వ దారుణాలకు పరాకాష్ట: చంద్రబాబు

  • టీడీపీ ఎంపీలను అరెస్ట్ చేయడం దారుణం
  • వయసులో పెద్దవారని కూడా చూడకుండా.. ఇలా ప్రవర్తిస్తారా?
  • రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు కేంద్రం దిగుతోంది

ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం ఎదుట మెరుపు ఆందోళనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలను అక్కడ నుంచి బలవంతంగా తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. వయసులో పెద్దవారని కూడా చూడకుండా ఇంత అమానుషంగా వారిని లాగేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీలను అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నవారి పట్ల ఇలాగేనా ప్రవర్తించేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర తీరు అప్రజాస్వామికంగా ఉందని అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ దమననీతికి పరాకాష్ట అని విమర్శించారు. రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు కేంద్ర ప్రభుత్వం దిగుతోందని చెప్పారు. 

Chandrababu
Telugudesam
mps
protest
delhi police
union government
  • Loading...

More Telugu News