Tollywood: ‘మొదలు పెట్టిన దాన్ని పూర్తిచేయడం నా బాధ్యత’ అంటున్న ‘ఆఫీసర్’ నాగార్జున

  • ‘ఆఫీసర్’ టీజర్ విడుదల చేసిన
  • వర్మ తో కలిసి పని చేసిన ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేశా
  • దేనికైనా ముగింపు అనేది అవసరం
  • మేము ఏం చేశామో ఓ సారి చూడండి : నాగార్జున ట్వీట్

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన ‘ఆఫీసర్’ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం టీజర్ విడుదలైంది. నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో ఈ టీజర్ ని విడుదల చేశారు. ‘ఆఫీసర్’ చిత్రం కోసం రామ్ గోపాల్ వర్మ తో కలిసి పని చేసిన ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేశాను. దేనికైనా ముగింపు అనేది అవసరం. మేము ఏం చేశామో ఓ సారి చూడండి’ అని పేర్కొన్న నాగ్, ‘ఆఫీసర్’ టీజర్ ను పొందుపరిచారు. కాగా, ఈ టీజర్ లో యాక్షన్ సన్నివేశాల్లో కనబడ్డ నాగ్ ‘మొదలు పెట్టిన దాన్ని పూర్తిచేయడం నా బాధ్యత’ అనడం చూడొచ్చు. 

  • Loading...

More Telugu News