Maharashtra: ఇద్దరు శివసేన నేతల హత్య... ఎమ్మెల్యే అరెస్ట్!
- మహారాష్ట్రలో ఘటన
- స్థానిక ఎన్నికలే కారణం
- ఎన్సీపీ ఎమ్మెల్యే అరెస్ట్
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై కేసు
మహారాష్ట్ర అహ్మద్ నగర్ లో స్థానిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జరిగిన శివసేన నేతలు సంజయ్ కోట్కర్, వసంత్ ఆనంద్ ల హత్య కేసులో ఎన్సీపీ ఎమ్మెల్యే సంగ్రామ్ జగ్తాప్ తో పాటు ఓ షార్ట్ షూటర్ ను, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయత్రం షహున్ నగర్ ప్రాంతంలో నడిచి వెళుతున్న కోట్కర్ ను మోటారు సైకిల్ పై వచ్చిన నిందితుడు తుపాకితో కాల్చి చంపాడు. ఆపై ఆనంద్ హత్య కూడా జరిగింది. సంగ్రామ్ జగ్తాప్ తో పాటు హత్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న బాలాసాహెబ్ కోట్కర్, సందీప్ గుంజాల్, భానుదాస్ కోట్కర్ లను అరెస్ట్ చేశామని, హత్యల వెనుక ప్రమేయమున్న ఆరోపణలపై మరో మరో ఎన్సీపీ ఎమ్మెల్యే అరుణ్ జగ్తాప్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే శివాజీ కార్డిల్ లపైనా కేసులు పెట్టామని, వారిపై విచారణ జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని 12వ తేదీ వరకూ కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతించిందన్నారు.