Andhra Pradesh: టీడీపీ మంత్రుల మధ్య విభేదాలు... గంటాపై రెచ్చిపోయిన అయ్యన్నపాత్రుడు!

  • గంటా శ్రీనివాస్ మూడు పార్టీలు మారాడు
  • అయినా మంత్రి పదవి ఇచ్చిన టీడీపీ
  • గతాన్ని మరచిపోయారంటూ అయ్యన్నపాత్రుడు విమర్శలు

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం మంత్రుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు కేవలం పదవుల కోసమే తెలుగుదేశం పార్టీలో చేరారని, గతాన్ని మరచిపోయి ఆయన మాట్లాడుతున్నారని మరో మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. తొలుత తెలుగుదేశంలో ఉండి, ఆపై ప్రజారాజ్యం, అక్కడి నుంచి కాంగ్రెస్ లో చేరి, తిరిగి ఆయన మంత్రి పదవి కోసమే టీడీపీలోకి వచ్చారని, మూడు పార్టీలు మారిన విషయాన్ని మరచిపోయి, ఆయనకు మంత్రి పదవిని ఇస్తే, ఇప్పుడు రాజకీయ స్వలాభాన్నే ఆయన చూసుకుంటున్నారని నిప్పులు చెరిగారు.

వీరిద్దరి మధ్యా కాంగ్రెస్‌ హయాంలో ఏర్పాటు చేసిన జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) విశాఖ జిల్లా కమిటీ విషయంలో విభేదాలు నెలకొని ఉన్నాయన్న సంగతి తెలిసిందే. తాను సిఫార్సు చేసిన వారికి పదవులు ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు పట్టుబడుతుండగా, గంటా మాత్రం తనకు నచ్చిన వారితో కమిటీలు వేసేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తనకు అనుచరుడిగా ఉండి, తనతో పాటు మూడు సార్లు పార్టీలు మారిన వ్యక్తికి కమిటీ చైర్మన్ పదవికి గంటా సిఫార్సు చేయడంతోనే అయ్యన్నపాత్రుడు ఆగ్రహానికి గురైనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News