hero nitin: అప్పుడు, నాకు పవన్ కల్యాణ్ ధైర్యం చెప్పారు : హీరో నితిన్

  • కాలేజీ రోజుల నుంచి పవన్ కల్యాణ్ కు అభిమానిని
  • ఆయన్ని చూసే సినిమాల్లోకి వచ్చా
  • నాకు హిట్స్ లేనప్పుడు ధైర్యం చెప్పిన వ్యక్తి పవన్
  • కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసే వారు దేవుడితో సమానం

కాలేజీలో చదువుకునే రోజుల నుంచి తనకు పవన్ కల్యాణ్ అంటే ఇష్టమని, ఆయన అభిమానినని హీరో నితిన్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఆయన్ని చూసే సినిమాల్లోకి రావాలని అనుకున్నానని..అలాగే వచ్చానని తన సినిమాలు మంచి విజయాలు సాధించాయని చెప్పారు. అయితే, హిట్స్ లేని సమయంలో తనకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు.

 ఆయన (పవన్ కల్యాణ్)  ఎక్కువుగా బయటకు రారు, కానీ, నా సినిమా ‘ఇష్క్’  ఫంక్షన్ కు ఆయన వచ్చారు. బాగా మాట్లాడారు. పవన్ కల్యాణ్ రావడం వల్లే అసలు ‘ఇష్క్’ అనే సినిమా ఉంది, హీరో నితిన్ ఇంకా ఉన్నాడని తెలిసింది. ఆ సినిమాకు హైప్ వచ్చింది ఆయన వల్లే. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసిన వారు దేవుడితో సమానం. అప్పుడు, నాకున్న బాధ నాకే తెలుసు. ఆ సమయంలో ఆయన (పవన్ కల్యాణ్)  నాకు హెల్ప్ చేశారు’ అని చెప్పారు.  

hero nitin
Pawan Kalyan
Tollywood
  • Loading...

More Telugu News