AP Bhavan: ఆమరణ దీక్షలో వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం విషమం... అరెస్ట్ చేసేందుకు చేరుకున్న పోలీసులు!

  • ఏపీ భవన్ లో దీక్ష చేస్తున్న వైకాపా ఎంపీలు
  • వైవీ సుబ్బారెడ్డి షుగర్, బీపీ లెవల్స్ పతనం
  • వైద్యుల సూచనతో ఆసుపత్రికి తరలించే యోచనలో పోలీసులు

గడచిన మూడు రోజులుగా న్యూఢిల్లీలోని ఏపీ భవన్ లో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించింది. ఆయన షుగర్, బీపీ లెవల్స్ పడిపోయినట్టు ఈ ఉదయం పరీక్షలు జరిపిన వైద్యులు ధ్రువీకరించారు. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించాలని సిఫార్సు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆయన్ను అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో మరో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తన దీక్షను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

AP Bhavan
YSRCP
New Delhi
Protest
Hunger Strike
  • Loading...

More Telugu News