New Delhi: ప్రొటెస్ట్ కంటిన్యూ... రాష్ట్రపతి ముందు నిరసన!

  • న్యూఢిల్లీలోనే ఎంపీల మకాం
  • హోదాపై సానుకూల నిర్ణయం రావాల్సిందే
  • రాష్ట్రపతిని కలవాలని నిర్ణయం
  • నేడు రాజ్ ఘాట్ లో మౌనదీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, న్యూఢిల్లీలో నిరసనలను తెలియజేస్తున్న తెలుగుదేశం ఎంపీలు రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు. ప్రత్యేక హోదాపై సానుకూల నిర్ణయం వచ్చేంతవరకూ నిరసనలను కొనసాగించాలని భావిస్తున్న చంద్రబాబునాయుడి నిర్ణయం మేరకు రామ్ నాథ్ కోవింద్ ను కలసి రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై విజ్ఞప్తి చేయనున్నట్టు టీడీపీ ఎంపీలు వెల్లడించారు. నిన్న ప్రధాని మోదీ ఇంటి ముందు పోలీసులు తమపై దౌర్జన్యం చేశారని ఇప్పటికే ఆరోపించిన ఎంపీలు, ఈ ఉదయం సుజనా చౌదరి ఇంట్లో భేటీ అయి విభజన హామీల అమలుపై ఏ విధమైన ఒత్తిడి పెంచాలన్న అంశంపై చర్చించారు. ఈ సాయంత్రం రాజ్ ఘాట్ వద్దకు చేరుకుని మౌనదీక్ష చేయాలని కూడా నిర్ణయించారు.

  • Loading...

More Telugu News