Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తప్పిన ప్రమాదం!

  • ఔరంగాబాద్ సభలో పాల్గొని తిరిగి వస్తుండగా సంఘటన
  • రాజాసింగ్ ప్రయాణిస్తున్న కారును లారీతో ఢీకొట్టే యత్నం
  • అప్రమత్తంగా వ్యవహరించి కారు డ్రైవర్
  • సురక్షితంగా బయటపడ్డ ఎమ్మెల్యే 

హైదరాబాద్ లోని గోషామహల్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పెద్ద ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జరిగిన సభలో పాల్గొని ఆయన తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాజాసింగ్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి లారీతో ఢీ కొట్టేందుకు యత్నించారు. అయితే, కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో రాజాసింగ్ సురక్షితంగా బయటపడ్డారు. లారీ డ్రైవర్ పరారీలో ఉండగా, క్లీనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 కాగా, సభ ముగిసిన అనంతరం అర్ధరాత్రి సమయంలో ఔరంగాబాద్ నుంచి బయలుదేరానని, ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణించగానే మార్గ మధ్యంలో తన కారును లారీతో ఢీకొట్టాలని గుర్తుతెలియని వ్యక్తులు యత్నించారని రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై రాజాసింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు. లారీతో తన కారును ఢీకొట్టాలని చూశారని, తన కారు డ్రైవర్ అప్రమత్తం కావడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పారు.

Hyderabad
bjp
mla rajasingh
  • Loading...

More Telugu News