Narendra Modi: మోదీకి వారణాసిలోనూ భంగపాటు: రాహుల్ గాంధీ

  • 2019 తర్వాత కాంగ్రెస్‌కు పునర్వైభవం
  • కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ కలిస్తే వారణాసిలోనూ మోదీ ఓడిపోతారు
  • కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ సిద్ధ రామయ్యే సీఎం

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వారణాసిలోనూ ఓటమి పాలవుతారని జోస్యం చెప్పారు. మోదీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్సీలు కలిస్తే ఇది సాధ్యమేనని పేర్కొన్నారు. బెంగళూరులో పర్యటిస్తున్న రాహుల్ మాట్లాడుతూ విపక్షాల ఐక్యతను చూసి మోదీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారని అన్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ విపక్షాలను ఏకం చేసి ఐక్యత కొనసాగిస్తామని చెప్పారు. 2019 తర్వాత కాంగ్రెస్‌కు పునర్వైభవం ఖాయమన్నారు.

వచ్చే నెలలో కర్ణాటకలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యే మళ్లీ పగ్గాలు చేపడతారని స్పష్టం చేశారు. మోదీ పాలనలో ఎవరూ సంతృప్తిగా లేరని, రైతులు, దళితులు, పేదలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు.. ఇలా అందరూ అసంతృప్తిగానే ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు.

Narendra Modi
Rahul Gandhi
BJP
Congress
Varanasi
Karnataka
  • Loading...

More Telugu News