YSRCP: వైసీపీ ఎంపీ వరప్రసాద్ కు తీవ్ర అస్వస్థత..ఆసుపత్రికి తరలింపు!

  • రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలింపు
  • ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు
  • ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా దీక్ష చేయడం సరికాదన్న వైద్యులు

ఏపీకి ప్రత్యేక హోదా నిమిత్తం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీలలో మరొకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ తీవ్ర  అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఆయన దీక్ష చేయడం సరికాదని వైద్యులు చెప్పారు. వైద్యుల సూచనల మేరకు పోలీసులు బలవంతంగా ఆయన్ని అంబులెన్స్ లో రామ్ మనోహర్ లోహియా  ఆసుపత్రికి తరలించారు. ఐసీయూకు తరలించి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వరప్రసాద్ వయసు 65 ఏళ్లని నలభై ఏడుగంటల పాటు ఆయన దీక్ష చేసినట్టు వైసీపీ నాయకులు తెలిపారు. కాగా, దీక్ష చేస్తున్న తమ ఎంపీలను వైసీపీ అధినేత జగన్ ఫోన్ లో పరామర్శించారు. ఎంపీల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఫోన్ ద్వారా ఆయన పరామర్శించారు.

YSRCP
mp varaprasad
  • Loading...

More Telugu News