IRCTC: రైలు టికెట్లకు ఆధార్ అనుసంధానం చేస్తే బంపరాఫర్... రూ. 10 వేల వరకూ బహుమతి!

  • మూడు నెలల పాటు ఆఫర్
  • నెలకు ఐదుగురికి రూ. 10 వేల వరకూ ప్రోత్సాహక నగదు
  • రద్దు చేసుకుంటే వర్తించబోదన్న ఐఆర్సీటీసీ

రైలు టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే సౌలభ్యాన్ని అందించే ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్) ప్రయాణికుల కోసం బపరాఫర్ ఇచ్చింది. ఐఆర్సీటీసీలోని ఎకౌంట్ కు ఆధార్ ను అనుసంధానం చేసే ప్రయాణికులకు నగదు బహుమతులను అందిస్తామని తెలిపారు. జూన్ వరకూ వర్తించేలా ఓ ఆఫర్ ను ప్రకటించిన ఐఆర్సీటీసీసీ, ఈ మూడు నెలలూ ప్రతి నెలా రెండో వారంలో ఆధార్ అనుసంధానం చేసుకున్న ఖాతాల నుంచి డ్రా తీసి, ఐదుగురికి రూ. 10 వేల వరకూ బహుమతిని అందిస్తామని, వారు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణ చార్జీని తిరిగి ఇస్తామని వెల్లడించింది. అయితే, టికెట్ బుక్ చేసుకుని, రద్దు చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తించబోదని స్పష్టం చేసింది.

IRCTC
Aadhar
Link
Train Ticket
  • Loading...

More Telugu News