Narendra Modi: ఎంపీలమని కూడా చూడకుండా ఈడ్చుకెళతారా?: నిప్పులు చెరిగిన సుజనా చౌదరి

  • అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా?
  • మోదీ సర్కారు ఆదేశాలతో క్రూరంగా ప్రవర్తించిన పోలీసులు
  • ఆరోపించిన మాజీ మంత్రి సుజనా చౌదరి

తామసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? అన్న అనుమానం కలుగుతోందని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరిన ఎంపీలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తరలించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. తామంతా ప్రజా ప్రతినిధులమని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లారని, మోదీ సర్కారు ఆదేశాలతోనే పోలీసులు తమపట్ల క్రూరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఎంపీల అరెస్ట్ తరువాత ఆ ప్రాంతానికి చేరుకున్న సుజనా, తాను ఎంపీలను తీసుకెళ్లిన పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నట్టు చెప్పారు. రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలనూ తక్షణం నెరవేర్చాలన్నదే తమ డిమాండని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గబోయేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Narendra Modi
New Delhi
Sujana Chowdary
  • Loading...

More Telugu News