New Delhi: జేసీ దివాకర్ రెడ్డిని లాగిపారేసిన ఢిల్లీ పోలీసులు!

  • హోదా కావాలంటూ టీడీపీ ఎంపీల నిరసన
  • ప్రధాని ఇంటిని ముట్టడించే ప్రయత్నం
  • అరెస్ట్ చేసి తరలించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, ఈ ఉదయం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట ధర్నాకు దిగిన తెలుగుదేశం ఎంపీలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా వారిని తరలించే క్రమంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు లాగి పడేశారు. ప్రధాని ఇంటి ముట్టడికి టీడీపీ ఎంపీలు యత్నించగా, వారి నిరసనల గురించి ముందుగానే తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించడంతో పాటు ఆ ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎంపీలు అశోక్ గజపతిరాజు, గల్లా జయదేవ్, సీఎం రమేష్, మురళీ మోహన్, రామ్మోహన్ నాయుడు తదితరులంతా ప్రధాని నివాసం వద్దకు చేరుకోగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. అది నిషేధిత ప్రాంతమని నచ్చజెప్పినా ఎంపీలు వినక పోవడంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని బస్సులో అక్కడి నుంచి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషనుకు తరలించారు. అరెస్టులతో తమను ఆపలేరని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఈ సందర్భంగా సీఎం రమేష్ హెచ్చరించారు.

New Delhi
Narendra Modi
Protest
Telugudesam
JC Diwakar Reddy
  • Loading...

More Telugu News