Devaragattu: దేవరగట్టులో ఉద్రిక్తత... మాల మల్లేశ్వరుని ఆలయంలో నిధుల వేట!

  • బన్ని ఉత్సవంతో పేరు తెచ్చుకున్న దేవరగట్టు
  • మాల మల్లేశ్వరుని ఆలయంలో దుండగుల తవ్వకాలు
  • ఆలయ శిఖరం ధ్వంసం
  • దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు

దేవరగట్టు... కర్నూలు జిల్లాలోని ఈ చిన్న గ్రామం పేరు ప్రతి సంవత్సరం దసరా సీజన్ లో వినిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ జరిగే బన్ని ఉత్సవంలో దేవతా విగ్రహాల కోసం జరిగే సంప్రదాయపు కర్రల సమరం ఎంతో ప్రఖ్యాతిగాంచగా, ఈ పోరులో జరిగే హింసతో ఎంతో మంది గాయాలపాలవుతుంటారు. ఇప్పుడా దేవరగట్టు గ్రామం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇక్కడి మాల మల్లేశ్వరస్వామి దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆలయంలో తవ్వకాలు జరిపిన దుండగులు, ఆలయ శిఖరాన్ని సైతం నాశనం చేశారు. జరిగిన ఘటనపై గ్రామస్థుల నుంచి ఫిర్యాదును అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ముందుజాగ్రత్త చర్యగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Devaragattu
Banni Utsavam
Mala Malleswarudu
  • Loading...

More Telugu News