Sri Reddy: నా హౌస్ ఓనర్ ఐఏఎస్... ఇల్లు ఖాళీ చేయమని చెప్పేశాడు: వాపోయిన శ్రీరెడ్డి

  • ఫిల్మ్ చాంబర్ ముందు హాఫ్ న్యూడ్ ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి
  • ఇల్లు ఖాళీ చేసేయాలని ఆదేశించిన ఓనర్
  • అల్పబుద్ధిని చూపించారని కామెంట్ చేసిన శ్రీరెడ్డి

నిన్న ఫిల్మ్ చాంబర్ ముందు అర్థనగ్నంగా నిరసన తెలిపిన నటి శ్రీరెడ్డిని తక్షణం ఇల్లు ఖాళీ చేయాలని ఆమె అద్దెకుంటున్న ఇంటి యజమాని ఆదేశించారు. ఈ విషయాన్ని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో చెప్పుకుని వాపోయింది. ఇంటి యజమాని ఓ ఐఏఎస్ ఆఫీసరని, ఉన్నత స్థాయిలో ఉన్నా, అల్పబుద్ధిని చూపించారని, తానుంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేయాలని చెప్పారని, ఎంత గొప్ప ప్రజలో అంటూ ఈ ఉదయం ఓ పోస్టును పెట్టింది. అంతకు ముందు "అక్కా నువ్వు మంచి డాన్ అంట. ఎవరినైనా గోడౌన్స్ లో వేసి కుమ్మిస్తావంట. అంకుల్స్ అందరికీ చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తావంట. నా జోలికి రాకు అక్కోయ్" అని మరో పోస్టు పెట్టింది. ఇది ఎవరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలన్న విషయాన్ని మాత్రం శ్రీరెడ్డి వెల్లడించక పోవడం గమనార్హం.
<iframe src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fiamsrireddy%2Fposts%2F2088663294713925&width=500" width="500" height="193" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true"></iframe>
<iframe src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fiamsrireddy%2Fposts%2F2088659531380968&width=500" width="500" height="174" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true"></iframe>

Sri Reddy
House
Vacate
Facebook
  • Loading...

More Telugu News