Raghuveera Reddy: కాంగ్రెస్ ను ఆసక్తికరంగా గడ్డితో పోల్చిన రఘువీరారెడ్డి!

  • ఎన్ని జంతువులు తిని వెళ్లినా పెరుగుతూనే ఉంటుంది
  • కాంగ్రెస్ పార్టీ గరిక వంటిదన్న ఏపీ పీసీసీ చీఫ్
  • తనదైన శైలిలో కన్నడ భాషా ప్రావీణ్యాన్ని చూపిన నేత

కాంగ్రెస్ పార్టీ ఓ గడ్డి లాంటిదని, ఎంతమంది పీకేసినా, ఎన్ని జంతువులు తిని వెళ్లినా పెరుగుతూనే ఉంటుందని చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. తెలుగు వార్తా చానల్ టీవీ9 నిర్వహించే 'ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ'లో పాల్గొన్న ఆయన, ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలోనైనా విజయం సాధించని విషయాన్ని గుర్తు చేసిన చానల్ ప్రతినిధి, ఏ నమ్మకంతో విజయంపై రఘువీరా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, "గరిక మేసేటువంటి గాడిదలు సచ్చిపోవచ్చు. గరిక మేసేటువంటి గాడిదలు మరో గుంపుకు పోవచ్చు. గరిక సావదు. గరిక కాంగ్రెస్" అని అన్నారు. ఆపై తనదైన శైలిలో కన్నడంలో మాట్లాడుతూ, సిద్ధరామయ్యను గెలిపించాలని కోరారు.

Raghuveera Reddy
TV9
Encounter With Murali Krishna
  • Loading...

More Telugu News