Kajal Agarwal: శ్రీవారి సన్నిధిలో హీరోయిన్ కాజల్... సెల్ఫీలకు పోటీపడ్డ యాత్రికులు!

  • తండ్రితో కలసి తిరుమలకు వచ్చిన కాజల్
  • దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ సిబ్బంది
  • ఉత్సాహంగా కనిపించిన కాజల్

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఉదయం తిరుమల శ్రీవెంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం వేళ, తన తండ్రితో కలసి ఆలయానికి చేరుకున్న ఆమెకు, టీటీడీ సిబ్బంది దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని అర్చకులు బహూకరించారు. శేషవస్త్రాన్ని ధరించి దేవాలయం బయటకు వచ్చిన కాజల్ తో ఫోటోలు దిగేందుకు యాత్రికులు పోటీ పడ్డారు. కాజల్ సైతం ఉత్సాహంగా తనను పలకరించిన వారితో మాట్లాడుతూ, వారితో ఫోటోలు దిగుతూ కనిపించింది.

Kajal Agarwal
Tirumala
TTD
  • Loading...

More Telugu News