Arun Jaitly: అరుణ్ జైట్లీ ఆరోగ్యాన్ని అనుక్షణం గమనిస్తున్న వైద్యులు!

  • నేడు జైట్లీకి కిడ్నీ ఆపరేషన్
  • రక్తపోటు, మిగతా అవయవాలను పరిశీలిస్తున్న వైద్యులు
  • కొన్ని రోజుల పాటు విధులకు దూరంగా ఉండనున్న జైట్లీ

నేడు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను చేయించుకోనున్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని గడచిన 24 గంటలుగా వైద్యులు అనుక్షణం గమనిస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు ముందు 24 గంటల పాటు రోగి శరీరంలోని మిగతా అవయవాలను, రక్తపోటు స్థాయిని, గుండె పనితీరును, రక్త ప్రసరణను గమనించాల్సి వుందని, అందుచేతనే జైట్లీని అబ్జర్వేషన్ లో ఉంచామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆపరేషన్ కు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, దాత కూడా సిద్ధంగానే ఉన్నారని వారు వెల్లడించారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ సందీప్ గులేరియా పర్యవేక్షణలో జైట్లీకి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరుగనుండగా, ఆపరేషన్ అనంతరం ఆయన కొన్ని రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉంటారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News