IPL: బ్రాబోయ్... 10 బంతుల్లో 39 పరుగులతో విధ్వంసం!

  • చివరి 3 ఓవర్లలో చేయాల్సిన పరుగులు 47
  • 10 బంతుల్లోనే 39 పరుగులు చేసిన బ్రావో
  • అసాధ్య విజయాన్ని సునాయాసం చేసిన మెరుపు ఇన్నింగ్స్

చేయాల్సింది 166 పరుగులు. 20 ఓవర్ల మ్యాచ్ లో అదేమీ ఛేదనకు అసాధ్యమైన స్కోరేమీ కాదు. ఇక ధోనీ, రైనా, రాయుడు, వాట్సన్, పాండ్యా వంటి స్టార్ ఆటగాళ్లున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది కష్టసాధ్యమైన స్కోరు కూడా కాదు. కానీ, జట్టులో అత్యధికులు విఫలం అయ్యారు. 8 వికెట్లు కోల్పోయి చివరి మూడు ఓవర్లలో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉన్న జట్టు విజయం అసాధ్యమే అనుకుంటున్న పరిస్థితుల్లో బ్రావో నమ్మశక్యం కాని రీతిలో చెలరేగిపోయాడు. టీ-20 స్పెషలిస్టు బౌలర్ గా పేరున్న మెక్లనగన్ కు చుక్కలు చూపించాడు.

 18వ ఓవర్ నుంచి వీరవిహారం చేసి, వరుసగా, 6, 6, 2, 4, 1, 6, 6, 2, 0, 6 పరుగులు పిండుకున్నాడు. తాను ఎదుర్కొన్న 10 బంతుల్లో 39 పరులుగు చేశాడు. దీంతో జయాపజయాల సమీకరణాలు మారిపోయాయి. అనూహ్య మలుపులు తిరిగి మ్యాచ్, ఉత్కంఠను పెంచుతూ సాగగా, విజయంపై ధీమాగా ఉన్న ముంబై డగౌట్ తో పాటు బ్రావో విధ్వంసంతో వాంఖడే స్టేడియంలోని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ మూగబోయారు.

IPL
Chennai Super Kings
Mumbai Indians
Bravo
  • Loading...

More Telugu News