Bharath Ane Nenu: 'భరత్ అనే నేను' పార్టీలో మహేష్, ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా... చూడండి!

  • నిన్న 'భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ ఫంక్షన్
  • కార్యక్రమం తరువాత స్టార్ హోటల్ లో పార్టీ
  • స్పెషల్ గెస్టుగా వచ్చిన రామ్ చరణ్

శనివారం రాత్రి హైదరాబాద్ లో మహేష్ బాబు కొత్త సినిమా 'భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ ఫంక్షన్ అయిపోగానే చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య ఓ స్టార్ హోటల్ లో పార్టీని ఎరేంజ్ చేయగా, ఆ పార్టీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా వచ్చి సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు శుభాకాంక్షలు చెప్పాడు. ఒకే ఫ్రేమ్ లో మహేష్ బాబు, ఎన్టీఆర్, కొరటాల, దానయ్యలతో పాటు చరణ్ కూడా ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరు ముగ్గురూ కలసి చిత్ర యూనిట్ సభ్యులతో కలసి ఫోటోలు దిగారు. నిన్న మహేష్ బాబు తన ప్రసంగంలో రామ్ చరణ్ 'రంగస్థలం' సూపర్ హిట్ అయిన విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరోలంతా ఒకటేనని, అభిమానులు తమలో తాము పోట్లాడుకోవద్దని సలహా కూడా ఇచ్చాడు. ముగ్గురు స్టార్ హీరోలు కలిసున్న చిత్రాన్ని మీరూ చూడండి.

Bharath Ane Nenu
Koratala Siva
Mahesh Babu
NTR
Ramcharan
  • Loading...

More Telugu News