Bharath Ane Nenu: ఉన్నది ఐదారుగురే... చేసేది ఏడాదికి ఒక్క సినిమానే: మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • టాలీవుడ్ లో ప్రతి సినిమా హిట్ కావాలి
  • అన్నీ ఆడితే పరిశ్రమ బాగుంటుంది
  • పెద్ద హీరోలమంతా బాగానే కలిసుంటాం
  • కెరీర్ బెస్ట్ సాంగ్స్ ఉన్న చిత్రమిదన్న మహేష్

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి చిత్రమూ హిట్ కావాలన్నదే తన అభిమతమని ప్రిన్స్ మహేష్ బాబు వ్యాఖ్యానించాడు. నిన్న రాత్రి వేలాది మంది అభిమానుల కేరింతల మధ్య హైదరాబాద్, నాంపల్లిలోని ఎల్బీ స్టేడియంలో 'భరత్ అనే నేను' ఆడియో వేడుక సాగగా, మహేష్ బాబు ఆసక్తికర ప్రసంగం చేశాడు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు ఐదారుగురేనని, తిప్పి కొడితే తమ నుంచి ఏడాదికి ఒక్క సినిమానే వస్తుందని, అందరి సినిమాలూ ఆడితే పరిశ్రమ ఇంకా బాగుంటుందని చెప్పాడు. తామంతా స్నేహంగానే ఉంటామని, ఫ్యాన్స్ కూడా బాగుండాలని అన్నాడు. ఈ సినిమాలోని థీమ్ సాంగ్ 'భరత్ అనే నేను', 'వచ్చాడయ్యో సామి' పాటలు తన కెరీర్ లోనే అత్యుత్తమమని భావిస్తున్నట్టు చెప్పాడు. తన తల్లి ఇందిరమ్మ పుట్టిన రోజు ఏప్రిల్ 20నే అని గుర్తు చేసిన మహేష్ బాబు, అదే రోజు సినిమా విడుదల కావడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నాడు.

Bharath Ane Nenu
Mahesh Babu
Pre Release Function
  • Loading...

More Telugu News