Fire: న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో భారీ అగ్నిప్రమాదం

  • టవర్‌లోని 50వ అంతస్తులో ప్రమాదం
  • మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
  • థ్యాంక్స్ చెప్పిన అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టవర్‌లోని 50వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్టు కూడా సమాచారం లేదు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రంప్ టవర్ పరిసర ప్రాంతాల్లోని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నికీలల్లో చిక్కుకున్న ట్రంప్ టవర్ ఫొటోను న్యూయార్క్ నగర అగ్నిమాపక శాఖ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. మంటలను అదుపు చేసినట్టు స్వయంగా ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. ‘‘ట్రంప్ టవర్‌  ప్రమాదం నుంచి బయటపడింది. అగ్నిమాపక సిబ్బంది బాగా పనిచేశారు. మీకు ధన్యవాదాలు’’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.

Fire
Donald Trump
Trump tower
New york
  • Loading...

More Telugu News