Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం... తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా!

  • అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు
  • రోడ్లపైకి చేరిన నీరు, ట్రాఫిక్ కు అంతరాయం
  • పలు జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు

కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం, దక్షిణ మరాఠ్వాడా నుంచి విదర్భ మీదుగా సాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండగా, హైదరాబాద్ లో అర్థరాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. నగరవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా, రోడ్లపైకి నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మలక్ పేట, పంజాగుట్ట, అమీర్ పేట, కోటి తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు పారుతూ ఉండటం, ఇదే సమయంలో బయటి ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులు ఒక్కసారిగా నగరంలోకి రావడంతో 5 గంటల నుంచి ట్రాఫిక్ నిదానంగా సాగుతోంది. పల్లపు ప్రాంతాల్లోని రోడ్లు జలమయం కాగా, చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు మహబూబ్ నగర్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, మేడ్చల్ తదితర జిల్లాల్లోనూ వర్షం కురిసింది.

  • Loading...

More Telugu News