junior ntr: నేను మహేష్ బాబును ఏమని పిలుస్తానంటే.. : జూనియర్ ఎన్టీఆర్

  • నేను మాత్రం ‘మహేష్ అన్న’ అంటాను
  • ఈ వేడుకకు నేను ఓ కుటుంబసభ్యుడిగా వచ్చాను
  • మహేష్ చేసినటువంటి ప్రయోగాత్మక చిత్రాలను మేమెవరమూ చేయలేదు
  • ఈ విషయంలో మాకు ఇన్సిపిరేషన్ మహేశ్

‘నందమూరి తారకరామారావుగారి మనవడిని అయిన నేను, అభిమాన సోదరులందరికీ నమస్కారాలు’ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ, ‘మహేష్ బాబును మీరందరూ ‘ప్రిన్స్’, ‘సూపర్ స్టార్’ అంటారు. కానీ, నేను మాత్రం ‘మహేష్ అన్న’ అంటాను. ఈ వేడుకకు నేను ముఖ్యఅతిథిగా రాలేదు..ఓ కుటుంబసభ్యుడిగా వచ్చాను. ఈ చిత్రం రికార్డులు తిరగ రాయాలని కోరుకుంటున్నా. ఓ కమర్షియల్ హీరోగా మహేష్ బాబు చేసినటువంటి ప్రయోగాత్మక చిత్రాలను మేమెవరమూ చేయలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పడిప్పుడే మేము కూడా మొదలు పెడుతున్నాం. దీనికి ఇన్సిపిరేషన్ ఆయనే. ‘భరత్ అనే నేను’ మీ కెరీర్ లో ఓ మైలురాలిగా నిలవాలని నేను కోరుకుంటున్నా. సమాజం పట్ల ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తి, దర్శకుడు కొరటాల శివ. అభిమానులకు కావాల్సిన మసాలాను గట్టిగా దట్టించి, శివ చెప్పదలచుకున్న సందేశాన్ని చిత్రాల ద్వారా అందిస్తారు’ అని అన్నాడు.

junior ntr
Bharath Ane Nenu
  • Loading...

More Telugu News