Bharath Ane Nenu: అభిమానులందరూ కలిసి కూర్చుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది : దర్శకుడు కొరటాల శివ

  • నేను హీరోతో సినిమా చేస్తుంటే ఆ హీరోకు గొప్ప అభిమానిని
  • నన్ను మించిన అభిమాని ఇంకెవరూ ఉండరు
  • ఇలా అభిమానులందరూ కలవడమనేది చాలాసార్లు జరగాలి

అభిమానులందరూ ఇలా కలిసి కూర్చుంటే తనకు ఎంతో సంతోషంగా ఉందని దర్శకుడు కొరటాల శివ అన్నారు. ‘భరత్ అనే నేను’ ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ, తాను హీరోతో సినిమా చేస్తుంటే ఆ హీరోకు గొప్ప ఫ్యాన్ ని అని, తనను మించిన అభిమాని ఇంకెవరూ ఉండరని అన్నారు. ‘భరత్ అనే నేను’ విజువల్ ఎంత అందంగా ఉందో, అభిమానులందరూ కలిసి కూర్చుంటే అంత అందంగా ఉందని, ఇలా అభిమానులందరూ కలవడమనేది చాలాసార్లు జరగాలని అన్నారు. ప్రతి సినిమా మంచి హిట్ అవ్వాలి, అభిమానులందరూ ఏకం కావాలని పిలుపు నిచ్చారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఒక వేదికపై ఉంటారని చెబితే మేము వచ్చేస్తామండి అంటూ యూఎస్ నుంచి తనకు ఫోన్ కాల్స్ వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 

Bharath Ane Nenu
Koratala Siva
  • Loading...

More Telugu News