superstar krishna: నా నమ్మకాన్ని మీ ఆశీస్సులతో నిజం చేయండి : సూపర్ స్టార్ కృష్ణ

  • ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న కృష్ణ
  • కొరటాల - మహేష్ కాంబినేషన్ ‘శ్రీమంతుడు’ ఎంతో అద్భుత విజయం సాధించింది
  • ‘భరత్ అనే నేను’ కూడా హిట్ కావాలని కోరుకుంటున్నా

‘భరత్ అనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ వేడుకకు హాజరైన సూపర్ స్టార్ కృష్ణ, నటుడు నరేష్ హాజరయ్యారు. ‘భరత్ అనే నేను’ మేకింగ్ ఏవీని కృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, కొరటాల శివ - మహేష్ బాబు కాంబినేషన్ లో గతంలో విడుదలైన ‘శ్రీమంతుడు’ చిత్రం ఎంత అద్భుతమైన విజయం సాధించిందని, ఇదే కాంబినేషనలో వస్తున్న ‘భరత్ అనే నేను’ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని, ‘నా నమ్మకాన్ని మీ ఆశీస్సులతో నిజం  చేయండి’ అని ఈ వేడుకకు హాజరైన అభిమానులను ఆయన కోరారు. కాగా,  ప్రీ రిలీజ్ వేడుకకు నటుడు సుధీర్ బాబు, టాలీవుడ్ ప్రముఖులు పలువురు హాజరయ్యారు.

superstar krishna
Bharath Ane Nenu
  • Loading...

More Telugu News