chris gyle: తొలి రెండు రోజులు ఎవరూ పట్టించుకోకపోవడంతో బాధపడ్డాను: క్రిస్ గేల్

  • ఈ సీజన్ లో బౌలర్లకు చుక్కలు చూపిస్తాం
  • ఆల్ రౌండర్లతో బలంగా ఉన్నాం
  • ప్రతి ఆటగాడి బాధ్యత జట్టు విజయమే 

ఐపీఎల్‌ వేలంలో తొలి రెండు రోజులు ఏ జట్టూ తనను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో బాధపడ్డానని విధ్వంసకర బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ తెలిపాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు ఆటగాడైన గేల్ ఐపీఎల్ ప్రారంభం నేపథ్యంలో మాట్లాడుతూ, తమ జట్టు కూర్పు ఎంతో బాగుందని అన్నాడు. ఆల్‌ రౌండర్లతో తమ జట్టు చాలా బలంగా ఉందని పేర్కొన్నాడు. తమ జట్టులోని బ్యాట్స్ మన్ ఈ ఏడాది బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని అన్నాడు. జట్టులోని ప్రతి ఆటగాడు జట్టు విజయం కోసం పూర్తి బాధ్యత తీసుకుంటాడని భరోసా ఇచ్చాడు. ఐపీఎల్ వేలంపై మాట్లాడుతూ, వేలంలో తనను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం బాధించిందని అన్నాడు.  ఐపీఎల్ కు దూరమవుతానేమోనని ఆందోళన చెందానని చెప్పాడు. అయితే మూడోరోజు వేలంలో అదృష్టవశాత్తూ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కొనుగోలు చేసిందని అన్నాడు. 

chris gyle
punjab
ipl
Cricket
  • Loading...

More Telugu News