yashwanth singh: నాలుగేళ్లలో మీరు చేసింది సున్నా: మోదీకీ షాకిచ్చిన బీజేపీ ఎంపీ

  • దళితుల పట్ల బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోంది
  • నాలుగేళ్లలో దళితులకు చేసిందేమీ లేదు
  • రిజర్వేషన్ల వల్లే తాను ఎంపీని కాగలిగా

ప్రధాని నరేంద్ర మోదీకి సొంత పార్టీకే చెందిన దళిత ఎంపీ యశ్వంత్ సింగ్ షాక్ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం గత నాలుగేళ్ల పాలనలో దళితుల పట్ల నిర్లక్ష్య ధోరణిని అవలంభించిందని విమర్శించారు. దళితుడినైన తాను తన సామర్థ్యాన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేక పోతున్నానని... కేవలం రిజర్వేషన్ల వల్లే తాను ఎంపీని కాగలిగానని చెప్పారు. దేశంలో ఉన్న 30 కోట్ల మంది దళితులకు బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని లేఖలో కోరారు. ఉత్తరప్రదేశ్ లోని నగినా నియోజకవర్గానికి యశ్వంత్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇటీవలే బీజేపీకి చెందిన మరో ట్రైబల్ ఎంపీ చోటే లాల్ ఖర్వార్ కూడా ప్రధానికి లేఖ రాశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తనను అవమానించారంటూ లేఖలో పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News