nakka ananda babu: వైసీపీని బీజేపీలో కలిపేందుకు జగన్ సిద్ధం: ఏపీ మంత్రి న‌క్కా ఆనంద బాబు

  • కేసుల మాఫీ కోసమే విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఉంచారు
  • పదవీ వ్యామోహంతో జగన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు
  • రాజధాని అభివృద్ధి కాకుండా జగన్ అడ్డుకుంటున్నారు
  • బీజేపీ మద్దతుతో జగన్‌పై కేసులు నత్తనడకన సాగుతున్నాయి

వైసీపీని బీజేపీలో కలిపేందుకు జగన్మోహ‌న్ రెడ్డి సిద్ధమయ్యారని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి న‌క్కా ఆనంద బాబు అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... కేసుల మాఫీ కోసమే త‌మ ఎంపీ విజయ సాయిరెడ్డిని జ‌గ‌న్ ఢిల్లీలో ఉంచారని ఆరోపించారు. జ‌గ‌న్ నిన్న నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో ఒక్కసారి కూడా ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ పేరును ప్రస్తావించలేదని విమ‌ర్శించారు. పదవీ వ్యామోహంతో జగన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, రాజధాని అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నారని మండిప‌డ్డారు. బీజేపీ మద్దతుతో జగన్‌పై కేసులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. 

nakka ananda babu
YSRCP
Jagan
Telugudesam
  • Loading...

More Telugu News