Salman Khan: సల్మాన్ సెలబ్రిటీగా ఎంత ఎత్తుకు ఎదిగాడో అన్ని బాధలు పడ్డాడు: షారూఖ్ ఖాన్

  • సల్మాన్ కు మద్దతు తెలిపిన షారూఖ్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • సల్మాన్ చాలా మంచోడు...ఇలా జరగకుండా ఉండాల్సింది

కృష్ణజింకలను వేటాడిన కేసులో జోధ్ పూర్ సెంట్రల్ జైల్ లో శిక్ష అనుభవిస్తున్న సల్మాన్‌ ఖాన్‌ కు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ ఖాన్‌ గతంలో మద్దతుగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సల్మాన్ గురించి షారూఖ్ మాట్లాడుతూ, సెలబ్రిటీ హోదాతో కొన్ని సార్లు చాలా బాధ పడాల్సి వస్తుందన్నాడు. సెలబ్రిటీలపై ఆరోపణలు రాగానే సమస్యలు ప్రారంభమవుతాయని చెప్పాడు. వెంటనే కీర్తి మసకబారడం ప్రారంభమవుతుందని చెప్పాడు. సల్మాన్‌ విషయంలో కూడా ఇదే జరిగిందని తెలిపాడు. సల్మాన్ సెలబ్రిటీగా ఎంత ఎత్తుకు ఎదిగాడో, ఆరోపణల కారణంగా అన్ని కష్టాలు పడ్డాడని తెలిపాడు. సల్మాన్‌ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే వ్యాఖ్యలు, ఆరోపణలు చాలా వచ్చాయని, వాటన్నింటికీ వివరణ ఇవ్వాల్సి వచ్చేదని అన్నాడు. వ్యక్తిగతంగా సల్మాన్ తనకు బాగా తెలుసని చెప్పాడు. ఇవన్నీ జరగకుండా ఉండి ఉంటే బాగుండేదని షారూఖ్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. న్యాయవ్యవస్థను అంతా నమ్మాలని షారూఖ్ ముక్తాయించాడు. 

Salman Khan
Shahrukh Khan
Bollywood
  • Loading...

More Telugu News